అయితే.. తాజాగా అదే అంశంపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ షర్మిల. జగన్ మోహన్ రెడ్డి నా వీడియో చూపించి వాడుకున్నారని ఆగ్రహించారు. గతంలో నన్ను వాడుకున్నారని మండిపడ్డారు షర్మిల. చెల్లెలి మీద ప్రేమ ఉంటే గడిచిన ఐదేళ్లు విచారణ జరిపించక గాడిద పళ్ళు తోమారా ? అంటూ ఆగ్రహించారు షర్మిల.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. గతంలో అదాని సోలార్ పవర్ ఒప్పందాలతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల లంచం ముట్టిందని అమెరికాలో వెల్లడైందని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. మోదీ, అదాని ఒక్కరే.. ఇద్దరు వేరు వేరు కాదని వివరించరు.
దేశ పరువును, రాష్ట్ర పరువును అదాని, జగన్ అమెరికాలో తీశారని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. జగన్ సోలార్ ఒప్పందంలోనే కాదు కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులో కూడా లంచాలు తీసుకున్నారన్నారు. జగన్ లాంచల్లో నాకు ఒక్క పైసా లేదని నేను ఆరోపణలు చేయడం లేదని... జగన్ తీసుకున్న లాంఛల వల్ల ఏపీ ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఫైర్ అయ్యారు.