గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇంకా మరింత పెద్ద మహానగరంగా విస్తరించబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ ను ఔటర్ రహదారి వరకు విస్తరించే క్రమంలో శివారు మున్సిపాలిటీలతో పాటు రంగారెడ్డి - మేడ్చల్ - సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 51 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తొలి దశలో శివారు మున్సిపాలిటీలలో మొత్తం 51 గ్రామాలను కలిపేందుకు రెండు నెలల క్రితం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందులో అంశాలకు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు కొద్ది రోజుల నుంచి చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీల అధికారులు .. భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు .. ఇల్లు , ప్రభుత్వ ఆస్తులను మున్సిపాలిటీలోని వార్డులు ఖాతాలోకి చేర్చారు.


ఆస్తిపన్నులను వసూలు చేస్తున్న ఆయా గ్రామ పంచాయతీల పేర్లను సాఫ్ట్వేర్ లో నమోదు చేయకపోవడంతో ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు సాధ్యం కావడం లేదు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలో గ్రామాల్లో ఉన్నవారు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహించిన వారిని నేరుగా పురపాలక శాఖ అధికారులుగా పరిగణలోకి తీసుకున్నారు. గ్రామ పంచాయతీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించిన వారిని కూడా మున్సిపాలిటీ అధికారులు తీసుకున్న వార్డుల్లో పని విధానం ఇతర కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని వీరికి ఉద్యోగం ఇస్తున్నారు.


వీరందరికీ పురపాలక శాఖ నుంచి జీతాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల పరిధి పెరిగిన దృష్ట్యా మరికొందరు కొత్తవారిని నియమించుకోవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనా హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఎప్పటికి 51 గ్రామాలు మాయం అయ్యాయి. మరి కొద్ది రోజుల్లో మరికొన్ని గ్రామాలు కూడా సమీపంలో ఉన్న మున్సిపాలిటీలలో విలీనం కానున్నాయి. మున్సిపాలిటీలలో విలీనమైన 51 గ్రామాలలో మౌలిక వసతులపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెడుతున్నారు. కొత్తగా విలీనం అయిన గ్రామాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న అధికారులు కూడా తాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి నీటి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: