డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చాలా దేవాలయాలకు వెళ్లి అక్కడ గుడి మెట్లు కూడా కడగడం జరిగింది. తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను కూడా చేశారు.. ఇలా కొన్ని రోజులపాటు హడావిడి చేసిన తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమంటూ మీడియా ముందు తెలియజేయడం జరిగింది. అలాగే సనాతన ధర్మం అంటూ కూడా పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం కల్తీ నెయ్యి లడ్డు కోసం వాడింది అంటూ పవన్ కళ్యాణ్ లేని ఆరోపణలను చేశారట.
ఈ నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాణ్ తో పాటు , తెలంగాణ సిఎస్ హోం శాఖ అధికారికి HYD సివిల్ కోర్టు సైతం నోటీసులను జారీ చేసిందట. గడిచిన శుక్రవారం రోజున విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో పవన్ కళ్యాణ్ కు కోర్టులో కల్తీ లడ్డుకు సంబంధించి చుక్కెదురైంది.. వీరందరికీ వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో ఈ ముగ్గురు కూడా కోర్టు ఎదురుట హాజరు కావాల్సి ఉన్నదని న్యాయస్థానం తెలియజేసింది. తమ తదుపరి విచారణ ఈనెల 27 కి వాయిదా వేశారు. మరి కల్తీ లడ్డు వ్యవహారం పవన్ కళ్యాణ్ కు మరింత ఇబ్బందులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది.