తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.. అలా బాహుబలి, RRR, కార్తికేయ -2, పుష్ప వంట చిత్రాలు ఇప్పటికే మార్కెట్లో మంచి విజయాలను అందుకున్నాయి..కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కాంతారా, కేజిఎఫ్ తదితర చిత్రాలు విడుదలై బాగానే కలెక్షన్స్ రాబడుతున్నాయి. అలాగే ఇప్పటికే అటు టాలీవుడ్ సినిమాలు ఇతర భాషలలో కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇతర భాష చిత్రాలు కూడా టాలీవుడ్ లో బాగా వేయడానికి చూస్తూ ఉన్నాయి.


ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల పైన పాన్ ఇండియా సినిమా అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతున్నది.. త్వరలోనే పుష్ప-2, గేమ్ చెంజర్ వంటి చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాల పైన భారీగానే హైప్ ఉన్నది. కానీ కోలీవుడ్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలంటే ఎందుకో పెద్దగా ఫేమస్ కాలేకపోతున్నాయి. ఎక్కడ చూసినా ఈ సినిమాలు బెడిసి కొట్టేలా కనిపిస్తున్నాయట.. విక్రమ్ నటించిన తంగలాన్ , సూర్య నటించిన కంగువ సినిమా ఎందుకో పాన్ ఇండియా మార్కెట్లో పెద్దగా నిలవలేక పోతున్నాయని ఈ విషయం అటు మేకర్స్కు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయిందట.


తంగలాన్ సినిమా కథ ఈనాటిది ఆనాటిది కాదు కొన్ని వందల క్రితం కథ డైరెక్టర్ ఫారంజిత్ చాలా రీసెర్చ్  చేసి మరి ఈ విషయాలను తెలుసుకొని సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా సౌత్ లో బాగానే ఆడినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదని.. అందుకే పాన్ ఇండియా సినిమాగా పెద్దగా వర్కౌట్ కాలేదట. ముఖ్యంగా స్టోరీ, పాత్రలు కనెక్ట్ కాలేదని సమాచారం. సూర్య నటించిన కంగువా సినిమా కూడా డైరెక్టర్ శివ ఎంతో రీసెర్చ్ చేసి మరి ఈ సినిమా కథను రాసుకోవడం జరిగింది. హాలీవుడ్ స్టైల్ లో 100 ఏళ్ల క్రితం నాటి కథతో సూర్యతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా సరైన ఫలితాలను అందుకోలేకపోతోంది. చాలా నెగిటివిటీ మూట కట్టుకుంది. అయితే ఇలా ఎన్ని ఎదురైనప్పటికీ కూడా తమ తదుపరిచిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ని అందుకోవాలని తమిళ హీరోల కసి పెంచుతున్నాయి చిత్రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: