మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కూటమికి ఘోర పరాజయం ఎదురయింది. ఈసారి ఎలాగైనా గెలుస్తామని కాంగ్రెస్ కూటమి బావించింది. కానీ మహారాష్ట్ర ప్రజలు మాత్రం బిజెపి కూటమికి మాత్రమే పట్టం కట్టారు. ఈ తరుణంలోని 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర లో 235 స్థానాలు దక్కించుకుంది ఎన్డీఏ కూటమి. అంటే ప్రతిపక్ష హోదా కూడా... కాంగ్రెస్ కూటమిలో ఏ పార్టీకి రాలేదు. అచ్చం ఆంధ్రప్రదేశ్ తరహాలో ఎన్నికలు అక్కడ జరిగాయి.


ఫలితాలు కూడా బిజెపి కూటమికి అనుకూలంగా రావడం జరిగింది. ఇందులో బిజెపి 132 స్థానాలు  దక్కించుకొని లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన క్లారిటీ రానుంది. అయితే ఇదంతా పక్కకు పెడితే... మహారాష్ట్ర ఎన్నికల్లో... మొదటిసారిగా శరద్ పవార్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మరాటి యోధుడు.... శరద్ పవార్  కు చెందిన ఎన్సిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 86 స్థానాల్లో ఎన్సిపి పార్టీ పోటీ చేయడం జరిగింది. అయితే ఇందులో కేవలం పది స్థానాలు మాత్రమే గెలుచుకొని... చతికల పడింది. అదే సమయంలో అజిత్ పవార్ చేతిలో ఉన్న ఎన్సిపి 59 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 41 స్థానాలు గెలవడం జరిగింది. శరద్ పవార్ కంచుకోట ఆయన బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా... గ్రాండ్ విక్టరీ కొట్టారు అజిత్ పవార్.

బారామతి లోక్సభ నియోజకవర్గంలో... ఎంపిగా శరద్ పవార్ కుమార్తె ఉన్నా కూడా అక్కడ ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అంతే కాకుండా ఎన్సిపి  తరపున పోటీ చేసిన శరత్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ కూడా ఓడిపోయాడు. మొన్న లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ ఏకంగా 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 సీట్లు గెలుచుకుంది. కానీ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయింది శరద్ పవార్ పార్టీ.



అసలు ఆ పార్టీని పట్టించుకునే వాడే లేడు అన్నట్లుగా ప్రజలు ఓట్లు వేశారు. దీంతో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కూడా అజిత్ పవార్ వద్దకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.  అంటే శరద్ పవార్ కెరీర్ క్లోజ్ అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2026 లో ఆయన రాజ్యసభ సభ్యత్వం సమయం గడువనుంది. దీంతో అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: