- ( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) . .

ఇటీవల కాలంలో వరుస పెట్టి సీనియర్ రాజకీయ నేతలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. 1980 వ ద‌శ‌కంలో   రాజకీయాలు చేసి ఒక వెలుగు వెలిగిన నేతలు చాలామంది మృతి చెందుతున్నారు మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల మృతి చెందుతూ ఉండటం జరుగుతోంది.. కొద్ది రోజుల క్రితం ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విశాఖ జిల్లాలోని మాడుగుల మాజీ ఎమ్మెల్యే ... మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి చెందారు. ఆయన ఏకంగా మాడుగుల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి చెందిన సంగతి విధితమే. అబ్బయ్య సిపిఐ నుంచి రెండుసార్లు .. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇల్లందు ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు. ఈరోజు మరో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మృతి చెందటం విచారకరం.


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అత్యంత సన్నిహితుడు ... మిత్రుడు అయిన మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డి ( 85 ) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యం ... వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కొండపాక ఆయన స్వగ్రామం. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. కాగా 1985లో రామచంద్రారెడ్డి సిద్దిపేట జిల్లాలోని దొమ్మాట నియోజకవర్గం ( ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం ) నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


కేసీఆర్కు ఆయన మంచి మిత్రుడు .. రాజకీయంగా వీరిద్దరు సమకాలీకులు. ఆ కాలంలో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ... రామచంద్రారెడ్డి దుబ్బాక నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాల టిడిపిని బలపరిచిన నాయకులుగా వీరిద్దరికి మంచి పేరు ఉంది. రామచంద్ర రెడ్డి మరణ వార్త తెలుసుకున్న తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నేత‌లు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: