2022 నవంబర్ 4న ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు బాదుడే బాదుడు అనే కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించడం జరిగింది. అయితే ఆరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు సైతం ఆయన వాహనం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రాగానే రైతు బజారు వద్ద రాళ్లదాడి చేయడం జరిగిందట. ఈ విషయం అప్పటి రాజకీయాలలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు కూటమినేతలు. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్రావు, ఆయన సోదరుడు ఆయన అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగిందనే విధంగా వార్తలు వినిపించాయి.



వాస్తవానికి ఈ కేసులు సుమారుగా 17 మంది నిందితులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారట. కేవలం నలుగురిని మాత్రమే అరెస్టు చేశారని ఇందులో నందిగామ మాజీ ఎమ్మెల్యే ఆయన సోదరుడి పేర్లు మాత్రం ఎక్కువగా వినిపించాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పర్యటనకు ముందు అటు జగన్మోహన్ రావు అరుణ్ కుమార్ ఇద్దరు కూడా తమ అనుచరులతో రెండు రోజుల ముందు సమావేశం అయ్యారని ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలని చూశారని అందులో భాగంగానే ఒక బృందం విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి మరొక రెండు బృందాలు చంద్రబాబు పైన రాళ్ల దాడి చేసేందుకే ఏర్పాటు చేశారంటూ  నందిగామ ఏసిపి ఏ.బి.జీ తిలక్ మీడియా సమావేశంలో ఈ విషయాలను తెలిపారు.


ఈ విషయం పైన వైసిపి కి చెందిన కొంతమంది నాయకులు హస్తము ఉందని దర్యాప్తులో భాగంగా వీటి పైన పూర్తిగా సమాచారాన్ని కూడా సేకరిస్తామంటూ తెలియజేశారు. చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావు ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసిన ఆ సమయంలో సరైన దర్యాప్తు జరగలేదంటూ తెలిపారట . అయితే ఈ కేసుని సెక్షన్ 307,120B, 553, 332, 323,rw 149, ipc ప్రకారం ఈ కేసును నమోదు చేసినట్లు తిలక్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: