టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆయనపై ఫిర్యాదు చేయగా ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ రామ్గోపాల్వర్మ హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసును హైకోర్ట్ కొట్టేసింది.ఈ క్రమంలో వర్చువల్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని హైదరాబాద్‌లోని తన లాయర్ ద్వారా ప్రకాశంజిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు వర్మ. ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం వచ్చిన ఫిర్యాదులోని అంశాలను నోటీస్ ద్వారా అటాచ్ చేయాలని వర్మ లాయర్ బాల పోలీసులను కోరుతున్నారు.మొత్తం మీద ఇటు విచారణకు రాకుండా, అటు ఎక్కడున్నారో తెలియకుండా వర్మ ప్రకాశంజిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టులో వర్మ వేసిన పిటిషన్‌పై రేపు మంగళవారం విచారణ జరగనుంది. ఒకవేళ వర్మకు బెయిల్ వస్తే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. లేకుంటే తనకు బెయిల్ వచ్చే వరకు వర్మ పోలీసులకు తన సినీ స్టైల్లో ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది. అయినా సరే ప్రకాశం పోలీసులు పట్టువదలని విక్రమార్కుల్లా వర్మను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.