కూటమిలో భాగంగా సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ.. క్రేజ్ మాత్రం జనసేన పార్టీ వైపే వెళుతున్నట్టు ఇప్పుడు చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ పార్టీకి కూడా గండంగా మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లడం అక్కడ కీలకమైన నిర్ణయాలు కూడా సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో అక్కడ నేతలు గెలిచారని కూడా తెలియజేశారు. దీంతో టీడీపీ పార్టీ గ్రాఫ్ కూడా తగ్గిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.


అలాగే హోం మంత్రి అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లుగా సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్ కేంద్రంగా బిజెపి వైపు ఏదో ప్లాన్ చేస్తున్నారని చర్చ రోజురోజుకి చాలా ప్రచారంగా మారుతున్నది. ఎప్పటికైనా సరే చంద్రబాబుకి మేకుగా పవన్ కళ్యాణ్ మారుతారని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారట.. చంద్రబాబు నాయుడు ఇటీవల 10 ఏళ్ల పాటు సీఎం గా ఉండాలని కోరిక ఉందంటూ పవన్ కళ్యాణ్ అనడం వెనుక కూడా చాలా వ్యూహమే ఉందనే విధంగా వార్తలు టిడిపి వర్గాలలో వినిపిస్తున్నాయి.


ఇలా చెప్పడం వెనుక బిజెపి వ్యూహం ఉన్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్నారు. ఎందుకంటే లోకేష్ ను సీఎం చేయాలని ఆలోచన కూడా చంద్రబాబు ఉన్నప్పటికీ అటు టిడిపి వర్గాలకు కూడా ఉన్నప్పటికీ ఈ విషయం తెలిసే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే అడ్డు పుల్ల  వేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు తన కొడుకుని సీఎంగా చూడాలని ఉంటే తన స్వార్ధాన్ని బయట పెట్టడం వల్ల తద్వారా రాజకీయాల అద్దె పొందాలని పవన్ కళ్యాణ్ అటు బిజెపి పార్టీ వ్యూహంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాబు వయసు కూడా ఎక్కువగా అవ్వడంతో ఒక సీఎం సీట్ లో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టడం కోసమే బిజెపి ప్లాన్ చేస్తూందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉన్నదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: