గత కొంతకాలంగా ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత ..EVM పనితీరు పైన ఇప్పటికే చాలా మంది పార్టీలు నేతలు సైతం పలు రకాల ఆరోపణలను తెలియజేశారు.. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మరొకసారి ఈవీఎం ట్యాంపరింగ్ విషయం వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా ఏపీలోని 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనే విధంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ విషయం తర్వాత చాలా మంది వైసిపి పార్టీకి సపోర్టుగా మద్దతుగా కూడా పలు పార్టీలు పలికాయి. అయితే ఇప్పుడు మరొకసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరుపైన దేశవ్యాప్తంగా అనుమానాలు మొదలవుతున్నాయి అనే విధంగా తెలుపుతున్నారు.


మెజారిటీ దేశాలలో ఉన్నట్లుగా బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు ఎందుకు వెళ్ళకూడదు అంటూ జగన్ ప్రశ్నించారు ప్రజాస్వామ్యం చాలా గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలి అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. ప్రాథమిక హక్కు అయినా వాక్స్వాతంత్రాన్ని అణిచివేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలు అంటూ తెలియజేశారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ధార్మినికతను తెలియజేశారు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.



వైసీపీ నేతలు కూడా ఎన్నికల తర్వాత చాలామంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకు తగ్గ ఆరోపణలను కూడా తెలిపారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓట్ల పర్సెంటేజ్ లెక్కించిన తర్వాత సుమారుగా 50 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయని తెలిపారు.. అలాగే ఏవీఎంల చార్జింగ్ కూడా 100% ఉండడం తో పాటుగా కేవలం ఎన్నికల అయిపోయిన తర్వాత ఆరు నెలల వరకు ఈ డేటాను ఉంచాల్సి ఉండగా పది రోజులలోపే రిమూవ్ చేయాలని చెప్పడంతో అనుమానాలకు దారితీస్తోంది అంటూ తెలియజేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈవీఎం ట్యాంపరింగ్ అనే విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: