దీంతో మరోసారి మోడీ అభివృద్ధి అలాగే, ఏక్ నాథ్ షిండే హిందుత్వ వాదానికి జై కొట్టారు మహారాష్ట్ర ప్రజలు. అయితే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో... ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారని అందరూ చర్చించుకుంటున్నారు. కొంతమంది బిజెపికి చెందిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడని.. అంటున్నారు. మహారాష్ట్రలో బిజెపి పార్టీకి సంబంధించిన ఫడ్నవిచ్ ను ముఖ్యమంత్రి చేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కువ సీట్లు ఉన్నా కూడా బలమైన పార్టీగా... ఎదిగిన తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే అంటున్నారు. దీంతో... మహారాష్ట్ర బీజేపీ కూటమిలో... కల్లోలం నెలకొంది. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక పైన... బిజెపి కూటమి నేతలందరూ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అగ్ర నేతలు అందరూ... మహారాష్ట్ర పీఠం పైన చర్చిస్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం మొదటగా బిజెపి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు.
ఫడ్నవిచ్ కు రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొత్త చర్చ జరుగుతోంది. అయితే బిజెపికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాము ఊరుకోబోమని ఇటు... ఏక్ నాథ్ షిండే అంటున్నారు. అయితే అజిత్ పవర్ మాత్రం... తనకు కీలక మంత్రిత్వ శాఖలు కావాలని డిమాండ్ చేస్తున్నారట. అవసరమైతే తనకు కూడా ముఖ్యమంత్రి కావాలని అంటున్నారని చర్చ జరుగుతోంది. మరి దీనిపై బిజెపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.