సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్న సంగతి తేలిసిందే.సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో, ఫోటో మార్ఫింగ్ లతో,గత ఎన్నికల ముందు చంద్రబాబు పవన్,లోకేష్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ధూషణలకి దిగిన విషయం తెలిసిందే.దీంతో ఒంగోలులో పోలీస్ కేసు నమోదైన దృష్ట్యా విచారణకి హాజరు అవ్వమని పోలీసులు గత కొన్ని రోజులుగా కోరుతుంటే వర్మ మాత్రం పరారిలో ఉన్నాడు.ఇక వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నా కూడా ఐపి అడ్రస్స్ మాత్రంహైదరాబాద్ లో చూపిస్తుంది. దీంతో శంషాబాద్, షాద్ నగర్ లోని వర్మ రెండు ఫామ్ హౌస్ లపై పోలీసుల ఫోకస్ చేసారు.ముందు జాగ్రత్తగా చెన్నై,కోయంబత్తూరు,కేరళ,ముంబై లకి కూడా ప్రత్యేక బృందాలు వెళ్లాయి.ఆంధ్రప్రదేశ్ లోని మూడు కోర్టులో వర్మ బెయిల్ కోసం అప్ప్లై చేసాడు. దీంతో బెయిల్ వస్తుందన్న ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాడని తెలుస్తుంది.ఇక ఈ కేసులో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో తన కోసం ఏపీ పోలీసులు గాలించడం పై డైరెక్టర్ ఆర్జీవి ఓ వీడియో ను రిలీజ్ చేసారు. ఆ వీడియో లో ఏముందంటే ఈ కేసులకు నేనేం వణికిపోవడం లేదు. ఏడాది కింద పెట్టిన పోస్ట్ వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట. నేను పోస్ట్స్ పెట్టిన వారికీ కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్న నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్న అని ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.అయితే ఆర్జీవీ చేసిన ఈ వైరల్ వీడియోపై పోలీసులు ఎలాంటి చర్యలు తీస్కుంటారానేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV