రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్..(RTPP) ఫ్లయాష్ వివాదం గత రెండు రోజుల నుంచి చర్చనీయంశంగా ఏపీలో మారింది. ఈ ఫ్లై యాష్ కోసం ఏకంగా తాడిపత్రి జమ్మలమడుగు నియోజకవర్గాలలో కూటమి నేతల మధ్య ఒక రచ్చ కొనసాగుతోందని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటి పైన కూడా పలు రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు ఈ కూటమి నేతల పైన సీరియస్ గా ఫైర్ అవుతూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో దీనిపైన జిల్లా అధికారులతో మాట్లాడాలి అంటూ సూచనలు ఇచ్చారట.అనంతరం జేసి ప్రభాకర్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన తీరు పైన అసంతృప్తిని తెలియజేశారు చంద్రబాబు. ఇలాంటి వివాదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉన్నారని ఈ విషయంలో శాంతిభద్రతల సమస్య కూడా రాకుండా చూడాలి అంటూ అధికారులకు తెలియజేశారట చంద్రబాబు. ఈ ఘటన పైన పూర్తిస్థాయిలో నివేదికలు అందించాలని అధికారులను కోరడం జరిగిందట సీఎం చంద్రబాబు.


ఇలా ఆర్టిపి ఉచిత బూడిద కోసం రెండు నియోజకవర్గాల నేతల మధ్య గట్టి పోటీ ఉందని మరొకపక్క కొండాపురం ,ముద్దనూరు, పొద్దుటూరు వంటి ప్రాంతాలలో కూడా పోలీసులు భారీగానే మోహరించినట్లు సమాచారం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెసి ప్రభాకర్ రెడ్డి అన్నచరులు వర్గీయులు ఆర్టిపిపి బూడిదన సైతం తోలుకోవడం ప్రారంభించారట. వీటికి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో ఈ వివాదం చెలరేగిపోయిందని సమాచారం. అలాగే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సైతం సరఫరా చేసే బూడిదన తాడిపత్రి సిమెంట్ పరిసరాలకు చేరకుండా జేసీ వర్గీయుల సైతం అడ్డుపడుతున్నారట. బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి టిడిపి నేత ప్రభాకర్ రెడ్డి మధ్య మాటలు యుద్ధంతో కొనసాగుతూనే ఉంది. మరి సీఎం చంద్రబాబు చేరువతో వీటికి పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: