ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఈ రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. డిసెంబర్ 20వ తేదీన ఈ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ కూడా జరగనుంది. వైసీపీ పార్టీ కి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ లిస్టులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య లాంటి కీలక నేతలు ఉన్నారు.

 

ఈ ముగ్గురు నేతలు వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందులో మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ రావు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అటు ఆర్ కృష్ణయ్య మాత్రం బీసీ ఉద్యమం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఖాళీ అయిన మూడు స్థానాలను కచ్చితంగా తెలుగుదేశం కూటమి దక్కించుకునే ఛాన్సులు ఉంటాయి. వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది.


అయితే మూడు రాజ్యసభ స్థానాలలో... తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలలో ఎవరికి ఏ స్థానం దక్కుతుందో అని అందరిలోనూ టెన్షన్.. ఉంది. వాస్తవంగా.. తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు వస్తాయని అంటున్నారు. ఒకటి జనసేన లేదా బిజెపి పార్టీకి వెళ్తుందని చెబుతున్నారు. ఒకవేళ జనసేన పార్టీకి వస్తే నాగబాబుకు రాజ్యసభ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీలో.. ఆ టికెట్ కోసం పోటీపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

 

గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్రావు, అశోక్ గజపతిరాజు  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది... లిస్టులో ఉన్నారు. ఇది... ఇలా ఉండగా హరికృష్ణ కూతురు సుహాసిని కి... రాజ్యసభ టికెట్ ఇస్తారని కొంత ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా చేస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఆమె ఓకే అంటే కచ్చితంగా ఆమెకు రాజ్యసభ టికెట్ వస్తుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: