అరెస్టు చేసుకోండి.. అరెస్టు చేస్తే మూడు నెలలు జైల్లో ఉంట.. మోగా చేసుకుంట.. రెస్టు తీసుకుని బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా' భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ 20 రోజుల క్రితం చేసిన ప్రకటన ఇదీ.
దీనికి కారణం లేకపోలేదు. రేపోమాపో కేటీఆర్ అరెస్టు అవుతారట అని అధికారా పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కేటీఆర్ స్పందించారు. అయితే కేటీఆర్‌పై ఇప్పటికే ఐదారు కేసులు నమోదయ్యాయి. అయితే అన్నీ పిటీ కేసులే.. స్టేషన బెయిల్ వచ్చేవే. ఒక్క ఫార్ములా -1 రేసు కేసు మాత్రమే కాస్త గట్టింది. ఇందులో ఫారిన్ సంస్థకు అనుమతి లేకుండా రూ.55 కోట్లు కేటాయించారు. దీనిని కేటీఆర్ కూడా అంగీకరించారు. దీనిపై ఈడీ కూడా వివరాలు కోరింది. ఇక కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కూడా గవర్నర్‌కు లేఖ రాసింది. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమని అంతా భావించారు. అందుకే కేటీఆర్ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధం అని ప్రకటించారు.
అయితే కేటీఆర్‌ను విచారణ చేయాలని ఏసీబీ రాసిన లేఖపై గవర్నర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎలాంటి అనుమతి రాలేదు. ఇక కేటీఆర్ కూడా మొన్నటి వరక దూకుడు ప్రదర్శించారు. కానీ ఢిల్లీ వెళ్లొచా‍్చక సైలెంట్ అయ్యారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి కూడా కేటీఆర్ అరెస్టుపై జోకులు వేస్తున్నారు. 'జైలుకు వెళ్లినవారు సీఎం అవుతున్నారని, కేటీఆర్ జైలుకు వెళ్లడానికి ఉబలాడ పడుతుంది. కానీ, ఆయన కంటే ముందే ఆయన చెల్లే జైలుకు వెళ్లొచి‍్చంది. సీఎం రేసులో ఆమే ముందు ఉంటుంది' అని సెటైర్ వేశారు.
ఇదిలా ఉంటే.. కేటీఆర్ అరెస్టుపై సీఎం రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనుమతి కోసం గవర్నర్‌పై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఫార్ములా ఈ రేసు కేసులో రూ.55 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ అంగీకరించారు. అయినా అరెస్టుకు మాత్రం ముందుకు రావడం లేదు. అవినీతి కేసుల్లో ఏడాదిగా విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కేటీఆరే కీలకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా కేటీఆర్ అరెస్టు విషయంలో రేవంత్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు.