- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . .

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు స్థానాలలో కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు తీసుకుని .. ఒకటి మిత్రపక్షమైన జనసేనకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. టిడిపికి దక్కే రెండు రాజ్యసభ స్థానాల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. వైసీపీ నుంచి తన ఎంపీ పదవి వదులుకొని టీడీపీ లోకి వచ్చిన మాజీ ఎంపీ బీదా మస్తాన్ రావు తో పాటు వర్ల‌ రామయ్య పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే విజయనగరం పూసపాటి సంస్థాన ఆధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన టిడిపిలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో పోలీట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆయనకు విజయనగరం లోక్సభ సీట్లు ద‌క్క‌లేదు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న ఆలోచన మేరకు అశోక్ కు టిక్కెట్ ఇవ్వలేకపోయారు.


ఆయన కుమార్తె అది విజయనగరం అసెంబ్లీ సీటు ఇవ్వగా ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికలలో క్షత్రియ సామాజిక‌ వర్గం గంప గుత్తగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేసింది. నూటికి నూరు శాతం ఈ సామాజిక వర్గం ఓటర్లు కూటమి పార్టీలకే ఓట్లు వేశారు. ఈ సామాజిక వర్గానికి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కలేదు. ఈ క్రమంలోని అశోక్ ని రాజ్యసభ పంపించడం ద్వారా ఆ వర్గానికి సానుకూల సంకేతాలు పంపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వ‌ర్గానికి ఏపీ క్యాబినెట్లో స్థానం లేదు.


ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుని డిప్యూటీ స్పీకర్గా సరిపెట్టేశారు. ఇప్పుడు అశోక్ కు రాజ్యసభ సభ్య‌త్వం ఇస్తే ఆ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత స్థానం ఉందని చాటి చెప్పాలని అనుకుంటున్నారు. పార్టీని నమ్ముకుని విధేయుడుగా ఉన్న అశోక్ ని పెద్దల సభకు పంపడం ద్వారా ఆయనకు సమచితమైన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది అన్న భావన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మూడు ఎంపీ సీట్లకు పోటీ గట్టిగా ఉంది. బీదా మస్తాన్ రావు బీసీ - వర్ల రామయ్య ఎస్సీ - అశోక్ గజపతి ఓసి. మరి తెలుగుదేశం రెండు ఎంపీ సీట్లు తీసుకుంటే ఎవరెవరికి సీట్లు కేటాయిస్తుంది అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: