ఇటీవలే క్యాబినెట్ సబ్ కమిటీ బేటిలో మంత్రి నారా లోకేష్ ఇలా కీలకమైన వ్యాఖ్యలు చేశారట.. ముఖ్యంగా స్కూల్లో, కాలేజీలు యూనివర్సిటీలో ఈగల్ కమిటీలు వేయబోతున్నట్లు తెలియజేశారు. గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం సబ్ కమిటీని హోం శాఖ మంత్రితో నిర్వహించినట్లు తెలియజేశారు. గంజాయి కట్టడి చేయడంలో ఎలాంటి రాజీ ఉండకూడదు అంటూ లోకేష్ తెలియజేశారు. ఇలాంటివి విక్రయించే వ్యక్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో రద్దు చేస్తామంటూ తెలియజేశారు నారా లోకేష్. అలాగే పాఠ్యపుస్తకాలలో కూడా చేర్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
మాదకద్రవ్యాల వల్ల కలిగే చెడు పరిణామాల పైన విద్యార్థులకు స్కూలు వయసు నుంచే చైతన్యం తీసుకురావడం చాలా ముఖ్యమని.. విద్యార్థులు బానిస కాకుండా ఉంటారు అంటూ మంత్రి లోకేష్ తెలిపారు. తను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది గంజాయి మారకద్రవ్యాల గురించి బాధపడుతున్న విషయాల పైన తనతో మాట్లాడారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నిటిని కట్టడి చేస్తానని ఆరోజు హామీ ఇచ్చానని అందుకే ఇప్పుడు ఇలా వీటి పైన ఉక్కు పాదం మోపుతున్నానంటూ లోకేష్ తెలియజేశారు.అలాగే మాదకద్రవ్యాలను రవాణా చేసే వారి ఫోటోలు వివరాలను ప్రత్యేకమైన వెబ్సైట్లో ఉంచుతామని పోలీస్ స్టేషన్లో రౌడీల ఫోటోలు ఏ విధంగా ఉంటాయి వీరి ఫోటోలు కూడా అదే విధంగా ఉంటాయని తెలిపారు నారా లోకేష్. వీటి వల్ల ఆయన మారుతారని లోకేష్ తన అభిప్రాయంగా తెలిపారు.