అర్హులు అయ్యుండి కూడా రేషన్ కార్డు లేని వారికి సంక్రాంతిలోగా కొత్త కార్డులను సైతం మంజూరు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. అందుకు సంబంధించి టిడిపి పార్టీ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది.. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైనా సరే సంక్షేమ పథకాలు అందజేయాలి అంటే రేషన్ కార్డు కచ్చితంగా ముఖ్యమని.. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరొక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పించన్ తీసుకునే వారు , అలాగే ఇతర పథకాలు విద్యార్థుల ఫీజు రిమెంబర్స్ వంటి వాటిని పొందాలి అంటే కచ్చితంగా రేషన్ కార్డు అవసరమని తెలియజేసింది.
డిసెంబర్ రెండవ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర ప్రజలు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చని ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్త కార్డులు కూడా మంజూరు చేయబోతున్నామంటూ తెలియజేశారు.. అయితే గతంలో సీఎంలుగా పనిచేసిన వారందరూ వారి ఫోటోలతో రేషన్ కార్డులను ముద్రించి ఇచ్చారు.కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుర్తింపుతో ఫోటోతో కార్డులో కొత్తగా చేరిన సభ్యులు లేకపోతే కొత్త వ్యక్తుల పేర్లను సైతం అప్డేట్ చేసుకోవచ్చని అందుకే కొత్త కార్డులను మంజూరు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు.