ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఆయన ఏది ముట్టుకున్న బంగారమే అవుతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో.. చంద్రబాబు అనుభవించిన బాధలు అన్నీ ఇన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి వేసిన కేసుల కారణంగా జైలుకు కూడా వెళ్లారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడుకు సింపతి పెరిగి.. మంచి పాజిటివ్.. అయిన సంగతి తెలిసిందే.

 

దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 130 కి పైగా టిడిపి సొంతంగా ఎమ్మెల్యేలను గెలుచుకుంది.  దీంతో ముచ్చటగా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అదే సమయంలో కేంద్రంలో చక్రం తిప్పే.. అవకాశం కూడా నారా చంద్రబాబు నాయుడుకు వచ్చింది.ఇక ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలను టార్గెట్ చేసి కేసులు కూడా.. పెట్టి వాళ్ళని వేధిస్తున్నారు. వాళ్లపై రివేంజ్ తీర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.

అయితే... అలాంటి చంద్రబాబు నాయుడు నిత్యం ఒకే రంగు బట్టలు వేస్తారన్న సంగతి తెలిసిందే. పసుపు రంగు దుస్తులను మాత్రమే చంద్రబాబు ధరిస్తారు. అయితే దీని వెనుక రహస్యం ఉందట.  పసుపు రంగు అనేది హిందువులకు  శుభసూచికం అని మనం భావిస్తాం. పసుపు కలర్ అనగానే పాజిటివ్ మైండ్ వస్తుంది. మన ఇండ్లలో కడప లకు కూడా... పసుపు రంగే పూస్తారు. హిందూ దేవతల వద్ద కూడా... కచ్చితంగా పసుపు వర్ణం ఉంటుంది.

అలాగే పసుపు బట్టలు వేస్తే... ఎంతమందిలో ఉన్న అదొక స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది. చాలామంది రాజకీయ నాయకులు వైట్ డ్రెస్ మాత్రమే వేస్తారు. కానీ ఎల్లో డ్రెస్ వేసే చంద్రబాబు నాయుడు చాలా స్పెషల్ గా మారిపోతారు. ఆయన 100 మందిలో ఉన్న గుర్తుపట్టవచ్చు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ రంగు కూడా పసుపు రంగు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని...  పసుపు రంగు దుస్తులు మాత్రమే నారా చంద్రబాబు నాయుడు ధరిస్తారట. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: