గత ప్రభుత్వంలో రాష్ట్ర మహిళా కమిషన్ గా వైసీపీ మాజీ నాయకురాలుగా పేరుపొందిన వాసిరెడ్డి పద్మ రాజకీయం ముగిసినట్టేనా అంటే.. అవును అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. వైసిపి పార్టీ నుంచి బయటికి వచ్చి రెండు నెలలు అవుతున్నప్పటికీ కానీ ఇప్పటివరకు ఆమె ఏ పార్టీలో చేరుతున్నారని విషయం పైన ఎక్కడ క్లారిటీ రాలేదు.. మొదట్లో జనసేన పార్టీలోకి వెళ్లబోతోందని రాజకీయ వర్గాలలో వార్తలు వినిపించిన కాదు టిడిపిలోకి వెళ్ళబోతుందని వార్తలు వినిపించాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఆమె గురించి చర్చ జరిగిన కానీ ఆమె ఊసు ఎక్కడ వినిపించడం లేదు..


వైసిపి పార్టీ నుంచి బయటికి రావడం వరకు ఓకే అయ్యింది కానీ రాజకీయంగా ఎలాంటి పదవులు అయినా అనుభవించొచ్చు కానీ పార్టీ అధినేతల పైన తీవ్రమైన విమర్శలు చేయడం వల్ల కచ్చితంగా రాబోయే రోజుల్లో వీరికి రాజకీయ భవిష్యత్తు కష్టమేనని చాలామంది నేతలు తెలియజేశారు.. ముఖ్యంగా రఘురామకృష్ణం రాజుకు దక్కినటువంటి పదవి అందరికీ రావాలి అంటే అందుకు బలమైన కారణం కూడా ఉండాలి అని పలువురు నేతలు తెలియజేస్తున్నారు. వైసీపీ హయాంలో చాలా ఇబ్బందులు వేధింపులకు గురయ్యారని సింఫతీతో ఆయనకు పదవి ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం వాసిరెడ్డి పద్మా విషయానికి వస్తే ఈమె టిడిపిలో చేరాలనుకున్నప్పటికీ ఒక బలమైన నాయకురాలిగా ఉన్న ఒక వ్యక్తి ఇమెను టిడిపి  పార్టీలో చేర్పించుకునేందుకు అడ్డుపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా లోకేష్, చంద్రబాబు వద్ద ఆ మహిళ నాయకురాలకి చాలా పలుకుబడి ఉన్నట్లు సమాచారం. ఆమె ఒప్పుకుంటేనే వాసిరెడ్డి పద్మకి టిడిపిలో చేరే అవకాశం ఉందని సమాచారం.  జనసేన పార్టీలో వీరిని చేర్పించుకునేందుకు పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడడం లేదట. కాపు సామాజిక వర్గాన్ని పార్టీలో ఎక్కువగా నింపితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని గ్రహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈమెను చేర్చుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వాసిరెడ్డి పద్మ వైసిపి పార్టీ నుంచి బయటికి వెళ్లడం వల్ల అవస్థలు పడుతోందని పలువురు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: