- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . .

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా అనేకసార్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావుకు వైసిపి అధినేత జగన్ డెడ్ లైన్ పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల త‌ర్వాత ఆయ‌న రెండు యేళ్ల పాటు ఆయన రెవెన్యూ మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు. తొలి మూడేళ్లపాటు ధర్మాన సోదరుడు కృష్ణదాస్ మంత్రిగా ఉంటే .. రెండో విడతలో ధర్మాన ప్రసాద్ రావుకు అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ప్రసాద్ రావుకు మూడుసార్లు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు జగన్. ఆయన రెండుసార్లు ఓడిపోయి 2019లో మాత్రమే గెలిచారు. ఈసారి ఓటమి తర్వాత రాజకీయంగా ఆయన అంత యాక్టివ్ గా లేరు. పైగా ఒక మామూలు సాధారణ సర్పంచ్ అయిన గొండు శంకర్ చేతిలో ఏకంగా 50 వేల పై చిలుకు ఓట్ల భారీ తేడాతో ధర్మాన ఓడిపోయారు. ఓట‌మి తర్వాత జగన్ నిర్వహించే సమీక్ష సమావేశాలకు కూడా ఆయన రావడం లేదు. వైఎస్ఆర్ ని ఎక్కువగా అభిమానించే ధర్మాన ఆయన జయంతి ... వర్ధంతి కార్యక్రమాలకు కూడా రాలేదు.


దీంతో ధర్మాన వైసీపీలో ఉన్నట్టా లేదా అని జగన్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. జిల్లాలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తూ వస్తున్న జగన్ శ్రీకాకుళం విషయంలో ధర్మాన అభిప్రాయాన్ని కోరిందని ... పార్టీలో కొనసాగితే ఆయన పేరుని ఇన్చార్జిగా ప్రకటించాలని చూస్తున్నారు. ఒకవేళ ఆయన ఇన్చార్జిగా పనిచేందుకు ఇష్టపడకపోతే వేరే పేరు సూచించాలని కూడా పార్టీ పెద్దలు కోరినట్లు తెలుస్తోంది. ఏదో ఒక సంగతి త్వరలో చెప్పాలని జగన్ ఆయన ముందు డెడ్లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ధర్మాన త‌న కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ పార్టీలో చేరితే తన కుమారుడికి ఫ్యూచర్ ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నారని అందుకే వైసీపీలో ఆయన అంత యాక్టివ్గా లేరని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: