ఆంధ్రప్రదేశ్లో పుష్ప-2 సినిమా మానియా కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా టికెట్లు రేటు పెంపు కోసం పుష్ప చిత్ర బృందం కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసినటువంటి ఒక ట్విట్ చాలా రచ్చ రేపోతోంది. అయితే ఈ ట్విట్ చేసిన కొన్ని నిమిషాలకి వాటిని డిలీట్ చేయడం గమనార్హం. అయితే అప్పటికే కొన్ని స్క్రీన్ షాట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.


అల్లు అర్జున్ గురించి అ ట్వీట్ చేసింది ఎవరో కాదు నంద్యాల టిడిపి పార్టీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.. ఈమె బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె..మొదట బిజెపి పార్టీ లో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత టిడిపి ఎంపీ టికెట్ రావడంతో టిడిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ ఎన్నికల ముందు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన అంశాన్ని మళ్లీ తీసుకువచ్చి..ఒక ట్విట్ చేసింది.. అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో చేసిన ఎలక్షన్ క్యాంప్ జనాలకు ఇంకా మర్చిపోలేకున్నాము నంద్యాలలో మీరు ఎలా అయితే ఫ్రీ ఎలక్షన్ వెంటనే సైతం నిర్వహించారు. అలాగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నామని వెల్లడించింది..


నంద్యాలకు వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్క్ అవుట్ అవుతుందని కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు కూడా మా సెంటిమెంట్ గా మారిపోయింది.. పుష్ప-2 సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అవ్వాలి అంటూ ఆమె కాస్త వెటకారంగానే ట్విట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వెంటనే ఆ ట్విట్ఎడిట్ చేయడం ఆ తర్వాత డిలీట్ చేయడం వంటివి చేసినట్లు సమాచారం. వీటి పైన అల్లు అర్జున్ అభిమానులు మాత్రం అదిరిపోయే కౌంటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: