ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశమంతట గెలిచిన రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళు.. ఓడిన వారంతా ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయామని.. మేనేజ్మెంట్ చేయడం వల్ల వారు గెలిచినటువంటి వాళ్ళ  అనేటువంటి సిద్ధాంతమే మన దేశంలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే ఇందులో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే.. ఇప్పటికే 2019లో తెలుగుదేశం పార్టీ ఒకసారి చెప్పింది..EVM హ్యాకింగ్ చేస్తారని.. 2014లో గెలిచింది కూడా అదే ఈవీఎంల ద్వారానే.. 2019 వచ్చేసరికి.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.. అప్పుడు కూడా వారు ఈవీఎంల ద్వారానే గెలిచారు.


అయితే 2024 లో మాత్రం ఓడిపోయారు.. ఓడినప్పుడు ఈవీఎంల వల్లే ఓడిపోయామంటున్నారు.. ఈ విషయం మీద ఇప్పుడు ఎక్కువగా రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలానే వ్యవహరిస్తోంది. గెలిచినటువంటి కాశ్మీర్లో కావచ్చు.. వాళ్ల మిత్రపక్షాలు అయినటువంటి పార్టీలు గెలిచినా కూడా ఈవీఎంల ద్వారానే గెలిచిన.. వారు కరెక్ట్.. అలాగే వీరు ఓడిపోయినప్పుడు మాత్రం.. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాలలో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్  చేశారని విధంగా తెరలేపుతున్నారు. మొత్తం మీద ఒక అప్పనమ్మకాన్ని కల్పించడం జరుగుతోంది.


ఓడిపోయినటువంటి పార్టీలు అన్నీ కూడా ఓడిపోయినందుకు ఒక సాకుగా ఈవీఎంలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో..బ్యాలెట్ పేపర్లను తీసుకువెళ్లే ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయట. మరి రాబోయేటువంటి రోజులలో బ్యాలెట్ల వైపుకు వెళ్తారా ఈవీఎంల వైపుకు వెళ్తారా అన్న విషయం తెలియాల్సి ఉన్నది.. ముఖ్యంగా కేంద్రంలో బీజాపీ ప్రభుత్వం ఈవీఎంలను మాత్రమే ప్రోత్సహిస్తుందనే అపవాదన వినిపిస్తోంది.. ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు, మాజీ ఎలక్షన్ కమిషనర్సు సైతం తమకు ఉండేటువంటి అనుమానాలను సైతం కాంగ్రెస్ పార్టీ అధినేతలను తెలియజేయమని తెలియజేసింది అందుకు సంబంధించి సమాధానాలను కూడా వారి ముందే తెలియజేస్తామంటూ తెలిపారు. మరి వీటి మీద కూడా పోల్ వంటివి నిర్వహించి మెజారిటీ ఎక్కువగా ఏ వైపు ఉంటే వాటికే మగ్గు చూపుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: