జగన్ దాదాపు ఆరు నెలల తరువాత జనంలోకి రావాలని చూస్తున్నారు. 2025 సంక్రాంతి పండుగ తరువాత జిల్లాల పర్యటన చేస్తాను అని జగన్ తాడేపల్లిలోని పార్టీ కేడర్ మీటింగులో ప్రకటించారు. ప్రతీ జిల్లాలో రెండు రోజులు పాటు ఉంటాను అంటున్నారు. అలా ఏకంగా 50 రోజుల పాటు ఏపీలోని 26 జిల్లాలను చుట్టి రావాలని జగన్ చూస్తున్నారు. అంతే కాదు క్యాడర్ కి తాను అండగా ఉంటున్నాను అన్న సంకేతాలు పంపించాలని చూస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పూర్తిగా డీమోరలైజ్ అయి ఉంది. వారి మీద వరసగా కేసులు పడుతున్నాయి. కూటమి అధికారంలో ఉంది. దాంతో గ్రామాలలో మండలాలలో వారిదే ఆధిపత్యం గా ఉంది. దాంతో వైసీపీ క్యాడర్ ఫుల్ సైలెన్స్ మోడ్ లో ఉంది. ఎందుకొచ్చిన తంటా అన్నట్లుగా ఉన్నారు
2019 నుంచి కూడా వైసీపీ క్యాడర్ లో మునుపటి ఉత్సాహం లేదు. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ అధినాయకత్వం కూడా వారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది. దాంతో వారు పూర్తి నిరాశ నీడలోకి వెళ్ళిపోయారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వారు తన సొంత బిజినెస్ తో బిజీగా ఉన్నారు. దాంతో వైసీపీ క్యాడర్ నీరసించి పోయి ఉంది.
ఇక సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్న కేసులు కానీ గ్రామాలలో టార్గెట్ చేసి మరీ వైసీపీ వారి మీద జరుగుతున్న దాడులు కానీ వైసీపీ నేతల నుంచి ఏ మాత్రం సహకారం అందకపోవడంతో క్యాడర్ అయితే పూర్తిగా డీలా పడింది అని అంటున్నారు. జగన్ అంటే జన సందోహం అన్న మాట ఉంది. ఆయన ఎన్నికల్లో గెలవవచ్చు లేదా ఓటమి పాలు కావచ్చు. కానీ జనం మాత్రం ఆయనకు ఎపుడూ వెంట ఉంటూ వస్తున్నారు. అలాగే క్యాడర్ కూడా జగన్ తో గతంలో పెద్ద ఎత్తున ఉంటూ వచ్చింది.
అలాంటిది ఇపుడు క్యాడర్ కనుక అనుకున్నంత స్థాయిలో కనిపించకపోతే అది ఇబ్బంది అవుతుందేమో అన్న చర్చ కూడా సాగుతోంది. మరి జగన్ రెఢీ అంటున్నారు, క్యాడర్ అంటే చూడాల్సి ఉంది అని అంటున్నారు.