దీంతో మహిళలందరూ కూడా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్లో లేకపోతే డబ్బులు జమ కావు అనే మాయలో పడిపోయారు.అందుకు కారణం సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ గా మారుతున్నది.. అయితే ఒక ఫేక్ న్యూస్ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయని లేకపోతే పడవ అనే విధంగా తెలియజేశారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు పోస్ట్ ఆఫీస్ వద్ద క్యూ కడుతున్నారు. ఇక యూట్యూబ్లో కూడా పలు రకాల థంబ్నేయల్స్ తో విషయాలు వైరల్ గా మారడంతో కొంతమంది ఈ విషయం పైన పరిశీలించి ఇది అవాస్తవమని తెలియజేశారు..
అయితే ఎవరికైతే అకౌంట్ లేదో వారు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుందట.. అయితే అలా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆధార్ తో లింక్ చేస్తారు కాబట్టి.. ఎవరివైనా సరే ఎక్కడైనా ఆధార్ కార్డుతో లింకు ఉన్న అకౌంట్ ని ఉపయోగిస్తే చాలు DBT పద్ధతిలోనే రూ.1500 రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాలో జమ కాబోతోంది. సోషల్ మీడియా వాట్సాప్ లో అందుకు సంబంధించి జనసేన కార్యకర్తలు కూడా కొంతమేరకు సమాచారాన్ని షేర్ చేసినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి స్క్రీన్ షాట్ కూడా వైరల్ గా మారుతున్నది. ఆడబిడ్డ నిధికి కచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదని తెలిపారు..