ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికలలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. వైసిపి ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు .. వరుస పెట్టి పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం తమ పదవి వదులుకొని పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత జగన్‌కు అత్యంత సన్నిహితులు కూడా కొద్ది రోజుల క్రితం వైసీపీని వీడారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఆయన ఎవరో కాదు ? మాజీ ఉపముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ( ఖాళీ కృష్ణ శ్రీనివాస్ ) టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.


మంగళవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు ఆళ్ల‌ నానికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. గత ఎన్నికలలో నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసిపి జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆయన జనసేనలో చేరతారు అని ప్రచారం జరిగినా చివరికి టిడిపిలో చేరేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆళ్ల నానికి అత్యంత సన్నిహితుడు విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత టిడిపి పెద్దలతో మంతనాలు జరిపి అధిష్టానాన్ని... నానిని ఒప్పించినట్లు తెలుస్తోంది. నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: