కిందిస్థాయి నుంచి ఆయన.. మంత్రిగా ఎదగడానికి... గులాబీ పార్టీ చాలా సహాయం చేసిందని చెప్పవచ్చు. అయితే అలాంటి ఈటల రాజేందర్... కొన్ని అనివార్య కారణాలవల్ల గులాబీ పార్టీని విడాల్సి వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు... ఆర్థిక శాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి పదవులు ఈటల రాజేందర్ కు దక్కాయి. అదే సమయంలో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఈటల రాజేందర్ పనిచేస్తున్నారని ఒక వార్త అప్పట్లో వైరల్ గా మారింది.
అయితే ఇది పసిగట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెంటనే ఈటల రాజేంద్రపై... వెయిట్ వేశారు. వెంటనే పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఈటెల రాజేందర్ గులాబీ పార్టీని బిజెపి చెంతకు చేరారు. అప్పటికే భూ కబ్జా కేసును ఈటల రాజేందర్ పై కేసీఆర్ ప్రభుత్వం వేయడం జరిగింది. అయితే చేసేది ఏమీ లేక తన ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల రాజేందర్ బిజెపి గూటికి వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.
అయితే భారతీయ జనతా పార్టీకి వెళ్లిన తర్వాత హుజురాబాద్ బై ఎలక్షన్ లో విజయం సాధించారు ఈటల రాజేందర్. ఇక మొన్నటి మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో కూడా గ్రాండ్ విక్టరీ కొట్టారు ఈటల. అయితే అలాంటి ఈటల రాజేందర్.. కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలో కాస్త అసంతృప్తిగా ఉన్నారట. పాత పార్టీని బాగుండేది అని చాలా ఇంటర్వ్యూలో కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావుతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీంతో ఆయన.. గులాబీ గూటికి వెళ్తారని ప్రచారం జరుగుతుంది.