కేంద్ర ప్రభుత్వం పేదలకు సైతం రేషన్ కార్డు ద్వారా బియ్యాన్ని సైతం అందిస్తూ ఉన్నది.. అయితే ఈ బియ్యాన్ని చాలామంది కడుపు నింపుతూ ఉన్నప్పటికీ మరి కొంతమందికి డబ్బు సంపాదించే వ్యాసనంలా మారిపోతోంది. చాలామంది ఈ బియ్యాన్ని సైతం అధిక ధరకు అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలియడంతో.. హుటా హుటిగా షిప్ దగ్గరికి వెళ్లి మరి పట్టుకోవడం జరిగింది.. దీంతో ఒక్కసారిగా స్టోర్ బియ్యం అక్రమ రవాణా విషయం వైరల్ గా మారింది.


దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. స్టోర్ బియ్యానికి బదులుగా నగదు చెల్లించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా లబ్ధిదారులకు చేరే బియ్యంతో సగానికి పైగా ఇతర దేశాలకు ఎక్స్ పోర్ట్ వెళ్లడంతో ఇలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం కట్ అనే వాదన కూడా వినిపిస్తోంది.. అంతేకాకుండా అందుకు తగ్గట్టుగా డబ్బులు కూడా వేయబోతున్నారట. మరి ఇది ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.



ఇప్పటికే ఈ విషయం పైన ఎన్నోసార్లు వార్తలు వినిపించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు.. కానీ రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం పైన ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.. దీనివల్ల అక్రమ రవాణా తప్పుతుందని.. అంతేకాకుండా రేషన్ కార్డు దారులు వారికి ఇష్టమైన బియ్యాన్ని కొనుక్కొని తినగలరనే విషయాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ విషయాన్ని మాత్రం ప్రజలు అంగీకరించబోరనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో కూడా ఇలాంటి రూమర్సే చాలానే వినిపించాయి.. కానీ ఇది అమలు చేయడం సాధ్యం కాదనే విధంగా చాలామంది నేతలు తెలియజేశారు.. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. మరి దీనిపైన స్పష్టత ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: