- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. ఆ ముగ్గురు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారు కావడం విశేషం. వారు ఎందుకు రాజీనామాలు చేశారు .. ఎవరు చెబితే రాజీనామాలు చేశారో ఎవరికి తెలియదు. రాజీనామాలు చేసిన వారిలో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ - బీసీ ఉద్యమ నేత ఆర్ . కృష్ణయ్య - నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త బీదా మస్తాన్ రావు ఉన్నారు. ఈ ముగ్గురిలో మస్తాన్ రావు - కృష్ణయ్య ఇప్పుడు మళ్లీ తాము రాజీనామా చేయడంతో జరుగుతున్న ఉప ఎన్నికలలో అవే స్థానాలకు పోటీపడుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు పాతవారే .. కాకపోతే కొత్త పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. మోపిదేవి పదవీకాలం రెండే ఉంది .. ఆయన తనకు పదవి అవసరం లేదు అంటున్నారు. మిగిలిన ఇద్దరికీ కూడా రాజ్యసభ ప‌ద‌వి వద్దని చెపుతున్నారని వేరే పదవులు కావాలన్నారని ప్రచారం జరిగింది.


అయినా చివరకు వారు రాజ్యసభకు మళ్ళీ పోటీ చేయక తప్పని పరిస్థితి. మస్తాన్ రావు టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక‌ కృష్ణయ్య బిజెపితో ఒప్పందం చేసుకుని రాజీనామా చేశారని .. అందుకే ఆయనకు బిజెపి తరఫున టికెట్ ఖాయమని అంటున్నారు. ఇక మూడో సీట్ కోసం టిడిపిలో కష్టపడిన వారి పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. తాజాగా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఆయన అనకాపల్లి ఎంపీ సీటు కోరుకున్నారు. బిజెపి నుంచి సీఎం రమేష్ కోసం ఆ సీటు కేటాయించడంతో విజయ్ కు ఎంపీ సీట్లు ఇవ్వలేదు. టిడిపి కోసం 5 ఏళ్లపాటు కష్టాలు పడి కేసులు ఎదుర్కొని ఆయన‌ పనిచేశారు. అందుకే ఆయనను రాజ్యసభకు పంపాల‌న్న‌ అభిప్రాయం బలపడుతుంది. అలాగే వర్ల రామయ్య లాంటి సీనియర్ నేతల పేర్లు కూడా రేసులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: