ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కడప స్టీల్ ప్లాంట్ గురించి ఈరోజు మంగళవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నించాడు. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ హామీ ఉందని కేంద్రం ఈ విషయంపై ఏం చేస్తుందని ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

దీని పైన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి ఇచ్చిన సమాధానం షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఆ అంశం తమ ముందు లేదని తెలిపారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి. ఒకవేళ ఏదైనా ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామంటూ కుమారస్వామి వెల్లడించారు. కేంద్ర మంత్రి సమాధానంతో కడప స్టీల్ ప్లాంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ మంగళం పాడిందా అనే చర్చలు మొదలయ్యాయి.


కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్రం ఇచ్చిన సమాధానం పైన ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కడప స్టీల్ ప్లాంట్ పై జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వేసిన ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకుంది. విభజన చట్టంలో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రం ఇచ్చిన హామీ గురించి ప్రస్తావిస్తూ ఇప్పటివరకు కేంద్రం ఈ హామీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.


జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నకు కేంద్రమంత్రి కుమారస్వామి సమాధానం ఇస్తూ ఈ అంశం ప్రస్తుతం తమ ముందు లేదని చెప్పాడు. అంతేకాకుండా ఏదైనా కొత్త ప్రతిపాదన వస్తే కేంద్రం పరిశీలిస్తుందంటూ కేంద్రం ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే...  కడప స్టీల్ ప్లాంట్  కేంద్రం వైఖరి బయట పడటంతో... ఏపీకి షాక్‌ తగిలింది. ఇప్పటికే విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్‌ కుట్రలు చేస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: