ముఖ్యంగా ముద్రగడ సొంత కూతురే పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని తెలియజేసింది.. అప్పుడు ఒక సవాలు విసిరారు. తాను జగన్ కానుక ఓడిపోతే.. తన పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డి గా మార్చుకుంటాను అంటూ తెలిపారు.. ప్రస్తుతం ఆయన పేరు మార్చుకొని రెడ్డిగా పేరు సంపాదించారు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ముద్రగడ గిరికి పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది.. అంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అని అర్థం.. పత్తిపాడు నియోజకవర్గానికి ముద్రగడ గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే రోజుల్లో నిలబడతారట.
ముద్రగడ పద్మనాభం గతంలో కాంగ్రెస్ ,టిడిపి పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ 2014- 19 మధ్య కాపు ఉద్యమాన్ని చేపట్టారు. అయితే ఆ తర్వాత మళ్లీ తప్పుకున్నప్పటికీ కాపుల రిజర్వేషన్ కల్పించేందుకు చంద్రబాబుకు సైతం లేఖలు గతంలో రాసేవారు. గతంలో జనసేన పార్టీలో చేరాలని చూసిన.. ఆహ్వానం రాకపోవడంతో ముద్రగడ వైసీపీ పార్టీలోకి చేరారు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ.. పిఠాపురం నియోజవర్గం బాధ్యతలను అప్పగించారు. కానీ అక్కడ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గెలవడంతో తీవ్ర నిరాశ చెందారు ముద్రగడ. ఇప్పుడు తన కొడుకుతో మరొకసారి రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు.