రెండక్షరాల ప్రేమను వర్ణించడానికి ఒక జీవితమే సరిపోదు అని చెబుతూ ఉంటారు కవులు. ప్రేమ గుడ్డిది.. భాషా బేధం.. కులం మతం.. తెలుపు నలుపు ఇలా ఏది చూడదు అని చెబుతూ ఉంటారు ప్రేమలో కొనసాగుతున్నవారు. ప్రేమలో ఉంటే ఈ ప్రపంచాన్ని మరిచిపోయేంత సంతోషం దక్కుతుంది అని అంటూ ఉంటారు భాగస్వామితో ఆనందంగా ఉన్నవారు. నిజమే ప్రేమ గొప్పది. రెండు మనసులను కలుపుతుంది ఇద్దరి మనుషులను దగ్గర చేస్తుంది. జీవితాంతం ఒకరికి తోడుగా మరొకరు కలిసి బ్రతకగలం అనే నమ్మకం ఇస్తుంది.


 ఇక ఈ మధ్యకాలంలో అయితే పెద్దలు కుదుర్చున వివాహాల కంటే ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో వింతైన ప్రేమలు కూడా తెరమీదకి వస్తున్నాయి. సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ పుట్టడం చూస్తూ ఉంటాం. కాలేజీలోనూ లేదంటే బస్ స్టాప్ లోను లేదంటే మరోచోట ఇలా అమ్మాయి అబ్బాయి చూపులు కలిసి తర్వాత పరిచయం పెరిగి పరిచయం కాస్త ప్రేమగా మారుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ప్రకృతి విరుద్ధంగా ఇద్దరు మగవాళ్ళు ప్రేమించుకోవడం ఏకంగా ఇద్దరు ఆడవాళ్లు ప్రేమించుకోవడం చూస్తూ ఉన్నాం.


ఇలా ఇటీవలే కాలంలో లెస్బియన్ ప్రేమలు ఎక్కువైపోయాయి. అయితే తమ ప్రేమను గెలిపించాలని తమ ప్రేమకు అండగా ఉండాలంటూ ఎంతోమంది లెస్బియన్లు అటు న్యాయపోరాటం చేస్తూ ఉండడం కూడా సంచలనగా మారిపోయింది. అయితే ఇటీవల అటు బెజవాడలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చదలవాడ పల్లవి అనే అమ్మాయి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సంచలనంగా మారింది. తన లెస్బియన్ పార్ట్నర్ అయినటువంటి జ్యోతిని ఆమె కుటుంబ సభ్యులు బంధించారని.. తామిద్దరం కలిసి జీవించడానికి అనుమతి ఇవ్వాలి అంటూ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్పందించిన హైకోర్టు ఇలా కుటుంబ సభ్యులు బంధించిన అమ్మాయిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా బెజవాడలో లెస్బియన్ జంట కేసు హైకోర్టు వరకు వెళ్లడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: