ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో రెండు పేర్లు రాజీనామా చేసిన వారివే వినిపిస్తూ వ‌స్తున్నాయి. అందులో ఒక‌టి బీసీ సంఘాల నేత ఆర్‌. కృష్ణయ్య పేరు వినిపిస్తుంటే.. మ‌రో పేరు బీదా మ‌స్తాన్ రావు పేరు ఉంది. వీరిద్ద‌రు కూడా ఇటీవ‌లే త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. ఇక రాజీనామా చేసిన మ‌రో మాజీ ఎంపీ మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌కు త‌న ప‌ద‌వీ కాలం మ‌రో రెండేళ్లు ఉండ‌డంతో ఆయ‌న ఎంపీగా వెళ్లేందుకు ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఈ ప్లేసులోకి సానా స‌తీష్ పేరు టీడీపీ నుంచి ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.


స‌తీష్ పేరు తెర‌మీద‌కు రావ‌డంతో అస‌లు ఎవ‌రు ఈయ‌న‌.. అన్న దానిపై పార్టీ వ‌ర్గాల్లోనూ .. ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. స‌తీష్ ఎవ‌రో తెలియ‌దు కాని.. టీడీపీ అనుకూల ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతికి మాత్రం స‌తీష్ మీద చాలా కోపం ఉన్న‌ట్టుగా ఉంది. కొద్ది నెల‌ల క్రిత‌మే స‌తీస్ ను ఓ ప‌వ‌ర్ బ్రోక‌ర్ గా తెర‌మీద‌కు తెచ్చింది. ఆయ‌న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న టైంలో వైసీపీ హయాంలోనూ చక్రం తిప్పారని…. ఇప్పుడు టీడీపీ హయాంలోనూ అదే పని చేస్తున్నార‌ని అంటున్నారు.


అస‌లు సానా సతీష్ పలుకుబడి ఏమిటో టీడీపీ నేతలకూ అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కాకినాడకు చెందిన ఆయన.. కొంత కాలంపాటు విద్యుత్ శాఖలో పని చేశాక వ్యాపారం కోసం ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ గ్రూప్‌ కంపెనీల్లోనూ ఆయ‌న ముందు డైరెక్ట‌ర్ గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఈడీ కేసుల్లోనూ ఆయ‌న పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌తీష్ పేరు చాలా కేసుల్లోనూ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయినా కూడా ఆయ‌న ఎప్పుడూ జైలుకు వెళ్లింది లేదు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచారని.. అందుకే ఇప్పుడు రాజ్య‌స‌భ సీటు ఇస్తున్నార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: