సినిమా అనేది ఒక ఊహ ప్రపంచం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో చూపించే విషయాలు ఏమీ నిజ జీవితంలో సాధ్యం కావు. హీరో ఫైటింగ్స్‌, లవ్ ట్రాక్‌లు, కామెడీ వంటివన్నీ కూడా కలల ప్రపంచంలో కనిపించినట్లు ఉంటాయి. ఇలాంటివి నిజ జీవితంలో కనిపించడం చాలా అరుదు. ప్రేక్షకులకు ఒక వినోదాన్ని అందించడానికి సినిమాలను కల్పితంగా రూపొందిస్తారు. కొన్నిసార్లు ఈ కల్పితమైన పాత్రలు, సన్నివేశాలు మన జీవితాలకు కాస్త దగ్గరగా పోలి ఉండొచ్చు కానీ మిగతా అన్ని సందర్భాల్లో కూడా మన జీవితాలకు, వాటికి ఎలాంటి సంబంధమే ఉండదు. కానీ చాలామంది హీరోలను సినిమాలో చూసి తాము కూడా అలాగే ఉన్నామని పోల్చుకుంటారు. ఇక అమ్మాయిలు కూడా అంతే. వాళ్లు హీరోయిన్లను చూసి వాళ్లలో తమను చూసుకుంటారు. ఇలా భ్రమల్లో బతికే వారే సినిమా నిర్మాతలు, హీరోలు, దర్శకులకు పెద్ద ఆస్తి అని చెప్పుకోవచ్చు.

పెద్దవారికంటే పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో స్కూల్ ఏజ్ నుంచే పిల్లలు సినిమాలకు బాగా అడిక్ట్ అవుతున్నారు. హీరోలంటే కేవలం మేకప్ పూసుకుని ఫేక్ ఫైటింగ్ లు చేసే వారు మాత్రమే అని కిడ్స్ నమ్ముతున్నారు. అయితే ఇలా నమ్మకూడదని ఎంతోమంది చెబుతున్నారు. ఇది సినిమా వాళ్లకి గండి కొట్టినట్లే అవుతుంది. ఇక సినిమా హీరోలు ఇలాంటి ప్రభావాల గురించి అసలే మాట్లాడరు. ఏదైనా చర్చ వచ్చిన సరే సినిమాలు చూడాల్సిందే, తమను ప్రజలు ఫాలో అవ్వాల్సిందే అన్నట్లుగా మాట్లాడతారు. కానీ ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లోని హీరోలు అసలు నిజమైన హీరోలే కాదని బహిరంగంగా కామెంట్స్ చేశారు.

 పవన్ ఒక పెద్ద సినిమా హీరో అయ్యుండి ఇలాంటి కామెంట్స్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. బహుశా ఆయన లాగా ఇలా కామెంట్స్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కడప జిల్లాలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. సినీ గ్లామర్ నుంచి వచ్చిన ఆయనే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు, హీరోలను పూజించాల్సిన పనేలేదు అని కుండబద్దలు కొట్టారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆయన ఈ బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకోవద్దని చక్కటి హితబోధ చేశారు. అందుకే చాలామంది ఆయనకి హాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: