ఇందులో భాగంగానే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలలో... తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో పాటలు, విందు వినోదాలు, నిర్వహించిన రేవంత్ రెడ్డి సర్కార్.. హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా... శనివారం రోజున ట్యాంక్ బండి సమీపంలో ఎయిర్ షో కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని పర్యాటకులు , సాధారణ ప్రజలు కూడా... ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు.
అయితే ఇక్కడ.. అందరి దృష్టిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకర్షించారు. స్టైల్ గా టీ షర్ట్ వేసుకొని... కళ్ళజోడు పెట్టుకొని రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పై... ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాలోనే స్టైలిష్ ముఖ్యమంత్రిగా... రేవంత్ రెడ్డి నిలుస్తున్నారని అంటున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.
ముఖ్యంగా దక్షిణ భారతంలో.. చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, సీఎం విజయన్ లాంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ వీళ్ళందరి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా యంగ్. అలాగే తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే ఈ యంగ్ అండ్ డైనమిక్ గా అతనిని పిలుస్తున్నారు. అంతేకాదు.. ఈ ఎయిర్ షోలో రేవంత్ రెడ్డి ధరించిన అద్దాలు 50 లక్షల రూపాయలు ఉంటుందట. దీంతో ధనిక ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అని కామెంట్స్ చేస్తున్నారు.