కూటమి ప్రభుత్వం లో ఇప్పుడు ఐక్యమత్యంగా పనిచేయాలి అంటే చాలామంది మక్కువ చూపడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. కింద స్థాయి నేతలలో మాత్రం ఐక్యమత్యం చాలా తక్కువగా ఉందనే విధంగా కూటమిలో టాక్ వినిపిస్తోందట. దీనివల్ల చాలా సమస్యలకు కూడా ఎదురవుతున్నాయట.ముఖ్యంగా ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఏర్పడినట్లుగా సమాచారం.. ఈ నేపథ్యంలోనే జనసేన నేత పైన చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటించినప్పుడు ఈ సమయంలోనే స్థానికంగా కూటమినేత ఒకరి పైన ఫిర్యాదు చేశారని సమాచారం.


అయితే ఇందులో భాగంగా కూటమిలో భాగంగా జనసేన  కార్పొరేటర్  చేసిన పని వల్ల రోడ్డున తమ బతుకులు  పడ్డామంటూ తోపుడు బండ్లు సంఘం సైతం ఫిర్యాదు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సందర్భంగా తాము ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్ తమపొట్ట కొట్టారని.. హైకోర్టులో పిటిషన్ వేసి..తోపుడు బండ్లను తొలగించారని ఫలితంగా తమ ప్రస్తుతం ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం అంటూ తెలిపారట. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారని సమాచారం.. అంతేకాకుండా మళ్లీ ఓట్ల కోసం ఆ జనసేన నేత మా వద్దకే రావాలని తోపుడుబండ్లు సంఘాలు సైతం హెచ్చరిస్తున్నారట.


నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే తమకు తగిన బుద్ధి చెప్పారంటు ఆవేదనని తెలిపారు.. ఈ నేపథ్యంలోనే తమ ను ఆదుకోవాలని సీఎం చంద్రబాబును సైతం తోపుడు బండ్ల సంఘాలు కోరారట..మరి ఇనేపద్యంలోనే వీరి ఆవేదనను సైతం సీఎం చంద్రబాబు ఏ మేరకు అర్థం చేసుకొని ఈ సమస్యను ఏ రీతిలో పరిష్కరిస్తారో చూడాలి మరి.. మరి ఆ జనసేన కార్పోరేటర్ పై ఫిర్యాదు రావడంతో ఆ నేత ఎవరు అన్నది ఇప్పుడు నేతలు తెగ వెతికేస్తున్నారట.. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: