ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప 2 హంగామా ఏ స్థాయిలో నడుస్తోందో చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్గా .. శ్రీలీల ప్రత్యేక సాంగ్లో నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా కేవలం నాలుగు రోజులకే రు . 824 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దిమ్మతిరిగే రికార్డులు సెట్ చేస్తోంది. అయితే 2025 లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా పుష్ప సినిమా పేరుతో పోస్టర్ వార్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అధికార ప్రతిపక్ష బిజెపి అప్పుడే యుద్ధం మొదలు పెట్టేసాయి. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. పుష్ప మేనేజింగ్తో ఇరు పార్టీల నేతలు ఫైటింగ్ కు దిగారు. అరవింద్ కేజ్రీ వాల్ ను పుష్ప మేనరిజంలో చూపిస్తూ ఎవరికీ తలవంచడు అంటూ ఆప్ పార్టీ నేతలు ఒక పోస్టర్ విడుదల చేశారు.
దీంతో అవినీతి పరులను అంతం చేస్తాం రఫా రఫా అంటూ బిజెపి సైతం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఈ సారి ఎలాగైనా ఢిల్లీ లో క్రేజ్రీవాల్ ను సీఎం పీఠం నుంచి గద్దె దింపాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎలాగైనా బీజేపీ ని ఢిల్లీ పీఠం ఎక్కకుండా చేయాలని ఆప్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్ ను కూడా గెలుచుకున్న ఆప్ ఢిల్లీ లో మళ్లీ పాగా వేసి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనా ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఓ రేంజ్‌లో ఉండనున్నాయి.