తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఒక గుర్తింపు ఉన్నది.. రాజకీయాలలో కూడా తనదైన ముద్ర చాటుకుంటున్న ఈ కుటుంబం సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కేవలం 9 నెలలలోనే అధికారంలోకి తీసుకువచ్చేలా చేసింది. కానీ నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి పదవులు అందుకున్న వారిలో నందమూరి హరికృష్ణ కేవలం మంత్రిగా ఆరు నెలలు కొనసాగారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించింది.


ఈ ఇద్దరి తర్వాత నందమూరి బాలకృష్ణ కేవలం ఎమ్మెల్యే గాని మిగిలిపోయారు. దీంతో ఈ విషయం ఇప్పుడు అటు అభిమానులలో నందమూరి అభిమానులలో కూడా మేము కూడా పడడం లేదట. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తున్న సమయంలో చాలామంది అసంతృప్తిని తెలియజేస్తున్నట్లు సమాచారం.. బాలయ్య 2014 నుంచి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వకపోవడంపై చాలామంది సీఎం చంద్రబాబును తప్పు పడుతున్నారు. అటు సినిమాలలో చిరంజీవికి సమానంగా సినిమాలను తీస్తూ పోటీలో నిలుస్తూ ఉన్న బాలయ్య.. రాజకీయాలలో మాత్రం అంతంతేగానే పేరు సంపాదించారు.

2001లో టిడిపి పార్టీని బాలయ్య నడిపిస్తారని అందరూ అనుకున్నారట. కానీ ఆ సమయంలో టిడిపి పార్టీ చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉండడంతో 2004లో ఓడిపోయింది.. ఆ తర్వాత మళ్లీ 2009లో ఓడిపోవడంతో బాలయ్య కాస్త వెనుకడుగు వేశారని సమాచారం.. ఆ సమయంలోనే బాలయ్య కు అల్లుడుగా నారా లోకేష్ రావడంతో పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం 2014లో మళ్లీ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు బాలయ్య..

2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో కూడా బాలయ్య గెలవడం జరిగింది. అయితే 2024లో కూడా బాలయ్య గెలిచినప్పటికీ తనకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు కానీ బాలయ్య అల్లుడు లోకేష్ కి మాత్రం ఇచ్చారు. ఇప్పుడు నాగబాబు కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడంతో చాలామంది బాలయ్యకు కూడా ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. మరి చంద్రబాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: