ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇవాళ ఇప్పటికే వైసీపీ పార్టీకి కీలక నేత , మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన... గంటలోపే వైసిపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న మరో బడా నేత... జంప్ అయ్యే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.

 వైసిపి  భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్... సంచలన నిర్ణయం తీసుకున్నారట. వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పి... తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ మేరకు తెలుగు తమ్ముళ్లతో టచ్ లోకి వెళ్ళారట గ్రంధి శ్రీనివాస్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో... పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు గ్రంధి శ్రీనివాస్. అంతేకాదు గత కొన్ని రోజులుగా... తన క్యాడర్ కు కూడా దూరంగా ఉంటున్నారట.

 అటు ఈ మధ్యకాలంలో ఐటీ రైట్స్ కూడా గ్రంధి శ్రీనివాస్  పైన జరిగాయి. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడినట్లు  గ్రంధి శ్రీనివాస్ పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఐటీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే... తనను తాను కాపాడుకోవచ్చని గ్రంధి శ్రీనివాస్ డిసైడ్ అయ్యారట. అందుకే వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం లోకి వెళ్లాలని అనుకుంటున్నారట.

 ఇప్పటికే భీమవరం టిడిపి ఇన్చార్జి తో కూడా టచ్ లోకి వెళ్ళారట గ్రంధి శ్రీనివాస్. తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా.. పసుపు కండువా కప్పాలని అంటున్నారట.  ఇవాళ సాయంత్రం లోగా ఆయన రాజీనామా చేసే ఛాన్స్ ఉందట. దీంతో వైసిపి పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అయింది.  మరి బడా నేతలు ఇద్దరు ఇవాళ ఒక్కరోజే పార్టీని వీడితే... వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: