ఏపీలో ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ లో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. ఈ క్రమం లోనే పలువురు వైసీపీ నేతల ప్లేస్ లను జగన్ మార్చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల కు ముందు కుండ మార్పిళ్లు చేసిన జగన్ ఇప్పుడు వారి ని తిరిగి పాత స్థానాలకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి .. వైసీపీ కీలక నేత చీటి కూడా జగన్ చింపేయ బోతున్నాడు. ఈ నేత ఎవరో కాదు అంబటి రాంబాబు. సత్తెనపల్లి వైసీపీ నుంచి అంబటి రాంబాబును గెంటేసి ఆ స్థానాన్ని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు జగన్. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు దానికి అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదని వైసీపీ లో వినిపిస్తోన్న సమాచారం.
తాజాగా అంబటి రాంబాబు సత్తెనపల్లి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వెటకారం చేశారని తెలుస్తోంది. తాను పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోతే మూడు రోజులు నిద్రపోలేదని ... కానీ ఒకయన 90 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని తెలిసి తనకు ధైర్యం వచ్చిందని అంబటి చెప్పారు. అసలు ఈ 90 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది ఎవరో కాదు.. మంగళగిరి అభ్యర్థి మురుగుడు లావణ్య కావడం గమనార్హం. అక్కడ గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయలేదు. అయినా కూడా ఆయన ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లారు.
ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ కండువా కప్పుకున్నారు. లోకేష్ ను ఓడిస్తానని సవాల్ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆ సీటులో వర్కవుట్ కాదని సత్తెనపల్లి వైపు ఆళ్ల రామకృష్ణా రెడ్డి చూస్తున్నారు. జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే అంబటి వెర్షన్ మరోలా ఉందట. తాను 2014లో చాలా స్వల్ప తేడాతో ఓడి ... 2019లో భారీగా గెలిచానని చెప్పారట. అయినా జగన్ వినేలా లేరని .. అంబటి చీటి చించేస్తారని.. అప్పుడు జగన్ పై అంబటి ధిక్కార స్వరం వినిపిస్తారని అంటున్నారు.