ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు గురువారం రెండో రోజు కలెక్టర్ల సదస్సు లో సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే. సోషల్ మీడియా పోస్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులతో ఇబ్బందులకు గురిచేసిన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ పై సీఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ‘కొందరు నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు. వీటిపై నియంత్రణకు ఓ కమిటీని నియమించాలి. మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, అనిత, సత్యకుమార్ యాదవ్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.

శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేలా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.ఇదిలావుడగా సైబర్ క్రైంలు, ఛీటింగ్‌లు జరగకుండా కంట్రోల్ చేయాలని రెండు టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలన్నారు. రియల్ టైంలో యూజ్ కేసులు తయారు చేసి, సీసీ కెమెరాలపై కంట్రోల్ చేయాలన్నారు. సీసీ కెమెరాల డేటా విషయంలో కాస్ట్ అఫెక్టివ్‌గా ప్లాన్ సిద్దం చేయాలన్నారు. సీసీ టీవీ కెమెరాలు అన్నిచోట్లా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ డేటా అంతా ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే సీసీ టీవీ కెమెరాలు అన్ని ప్రదేశాల్లో ఉన్నాయా లేదా చూడాలి. టెంపుల్, విగ్రహలు వద్దా కెమెరాలు పెట్టాలి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ డేటా ఆన్ లైన్‌లో పెట్టాలి అని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: