ఇక మంత్రి పదవులు విషయానికి వస్తే పాతికమంది ఉన్న వాటిలో కేవలం ఒకే ఒక్కరికి అవకాశం ఇచ్చారు జనగసేనకు నాలుగు మంత్రి పదవులను ఇచ్చారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని తీసుకొచ్చి మరి కిరీటం ఇస్తున్నారు అంటూ తెలియజేస్తున్నారు. ఆయన చట్ట సభలలో కూడా సభ్యుడు కాదని ఆ మాటకు వస్తే ఇప్పటిదాకా ఎక్కడ కూడా గెలవలేదని కూడా తెలుపుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారుతున్నది. కేవలం జనసేన పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని బిజెపి నేత ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి కూడా ఈ విషయాలను ఎక్కడ పట్టించుకోవడంలేదని కనీసం కూటమి ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫోటో లేదంటే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ తెలియజేశారు..
కూటమి అంటే మూడు పార్టీల నేతలు ఏ అంశం మీదైనా చర్చించుకోవలసి ఉంటుంది.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు మాత్రమే భేటీ అవుతూ ఉంటారు.. ఇప్పుడు మళ్లీ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించడంతో బీజేపీలో అసంతృప్తి మొదలయ్యిందట. విశాఖ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ గెలిచారు శాసనసభలు ఇప్పుడు బిజెపి పక్ష నేతగా ఉన్నారు.. ఈసారి సీట్లు రెట్టింపు అయిన మంత్ర పదవులలో రెండింటికి ఒకటి అయ్యిందని వెల్లడించారు.. 2014 నుంచి 19 మధ్య చూసుకుంటే బిజెపికి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరికీ మంత్రి పదవులు వచ్చాయని ఈసారి 8 మంది ఉంటే ఒక్కరికి అవకాశం ఇచ్చారని అందుకే బీజేపీలో అసంతృప్తి ఉన్నదంటూ తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించాలని అంటూ కూడా తెలిపారు. మూడు పార్టీల ఐక్యత చూసే జనాలు ఓటు వేశారని.. ఈ మూడు పార్టీలు కలిసి ఉండడం వల్లే గెలుపు సాధ్యమైంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. మొత్తానికి బిజెపి నేతలు కూడా మంత్రి పదవి విషయంలో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఇలా అసంతృప్తితో తమ విషయాలను బట్టబయలు చేస్తున్నారు.