ఆ సమయంలో టీడీపీ అధికారంలో లేదు. అప్పుడు టీడీపీ పరిస్థితి ఇప్పుడు వైసీపీ లాగానే వీక్ గా ఉంది. కారణాలు ఏవైనా గత పాలనలో టీడీపీ నేతలు పలు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఆ సమయంలో వైసీపీ టీడీపీ పారిపోయిందంటూ చాలా చులకనగా మాట్లాడింది. అయితే ఇప్పుడు వైసీపీ కూడా అదే పనిచేస్తూ అభాసుపాలు అవుతోంది. మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నట్లు వైసీపీ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు టీచర్ ఎమ్మెల్సీ విషయంలోనూ అదే ధోరణిని కనబరిచింది వైసీపీ.
అంతేకాదు, ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఇలా ఎన్నికలను బహిష్కరించడం అలవాటైపోతోంది. ఏపీలో ఇలాంటి తీరు కనబడటం వల్ల ఎవరికి నష్టమో లాభమో తెలియడం లేదు. ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా చతికిలబడిపోతే రాష్ట్రానికి నష్టమే జరుగుతుందా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా సాగునీటి సంఘాల ఎన్నికలు ఆల్రెడీ రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు నేడు 342 సంఘాల (డబ్ల్యూ యూఏల) ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నంలోగా నామినేషన్ల ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత వాటిని పరిశీలించడం జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ జరగొచ్చు జరగకపోవచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి ఓటింగ్ ఉంటుంది. సాయంత్రం చైర్మన్, వైస్‌చైర్మన్ సెలక్షన్ జరిగిపోతుంది.