అదేంటి అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కదా అల్లు అర్జున్ రెడ్డి ఎప్పుడు అయ్యారు ? అనుకుని ఆశ్చర్యపోతున్నారా ? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు నుంచి బన్నీని వైసీపీ వాళ్లు ఓన్ చేసుకుంటూ వస్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ను వైసిపి ఎలా సపోర్ట్ చేస్తుందో ? చూస్తూనే వస్తున్నాం. ఇక మెగా ఫ్యామిలీలో బన్నీ అల్లు ఆర్మీ పేరుతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ రేంజ్ లో తిరుగులేని క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కేడర్ తో బన్నీకి దూరం పెరిగింది.


బన్నీ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన తన సోదరుడు శిల్పా రవి కిషోర్ రెడ్డికి తన భార్య స్నేహ రెడ్డితో కలిసి వెళ్లి మరి మద్దతు తెలిపి వచ్చాడు. అక్కడితో ఆగకుండా తనకు నచ్చితే ఎవరు అయినా ఎక్కడ ఉన్నా వస్తాను అంటూ కామెంట్ చేశాడు. ఓవైపు మామయ్య పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి వైసిపి పై పోరాటం చేస్తుంటే ? అదే వైసిపి అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేయటం జనసేనతో పాటు మెగా అభిమానులకు నచ్చలేదు. నాగబాబు సైతం ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. ఇక పుష్ప 2 సినిమాను మెగా అభిమానులు చాలామంది జనసేన అభిమానులు.. పవన్ అభిమానులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అదే టైంలో వైసిపి వాళ్లు ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు.


ఇక ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఈ అరెస్టు అక్రమం అంటూ.. అన్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా కండనలు ఇచ్చారు. వైసిపి కేడర్లో చాలామంది మరి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అయితే అల్లు అర్జున్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వైసీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మావాడు అంటూ వైసీపీని బాగా అభిమానించే రెడ్డి సామాజిక వర్గం కామెంట్లు పెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: