- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ కు నందమూరి హీరోలకు మధ్య బాక్సాఫీస్ వార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా చిరంజీవి అభిమానులు .. బాలకృష్ణ అభిమానులు ఈ వార్ ను కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్క విషయంలో మాత్రం నందమూరి వంశం .. మెగా కాంపౌండ్ కంటే కాస్త ఎక్కువ అదే రాజకీయం. మెగా కాంపౌండ్ లో కేవలం హీరోలు మాత్రమే ఉన్నారు. నందమూరి కుటుంబంలో హీరోలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యే .. హిందూపురం నుంచి ఓటమి లేకుండా దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న వ‌రుస‌గా మూడు సార్లు ఓట‌మి లేకుండా ఎమ్మెల్యే అయ్యారు. ఇక మెగా కాంపౌండ్ లో రాజకీయంగా మొన్నటివరకు అన్ని అపజ‌యాలే. చిరంజీవి పొలిటికల్గా చేతులు ఎత్తేశారు. పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు.


బాలయ్య మాత్రం సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. అలా మెగా కాంపౌండ్ పై బాలయ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పుడు మెగా హీరోలు కూడా నందమూరి పాలిటిక్స్ కు ధీటుగా రాజకీయం మొదలుపెట్టారు. ఈ విషయంలో చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పవన్ మాత్రం పదేళ్లు ఓపిగ్గా ఎదురు చూసి ..తాను అనుకున్నది సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు జనసేన పార్టీ పెట్టి సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు తన కుటుంబం నుంచి సోదరుడు నాగబాబుని కూడా మంత్రివర్గంలోకి తీసుకువస్తున్నారు. రేపో మాపో చిరంజీవి కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రాజకీయం విషయంలో నందమూరి కాంపౌండ్ కు ధీటుగా మెగా కాంపౌండ్ కూడా ఎదుగుతున్న పరిస్థితి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: