తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలా ?దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. తొలివారం మూగిసే సరికి పుష్ప గాడు బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ ఏకంగా రు . 1000 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి తన స్టామినా ఏంటో ? దేశవ్యాప్తంగా చాటి చెప్పాడు. మరి ముఖ్యంగా పుష్ప 2 సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో సంచనానాలతో దూసుకుపోతూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప 2 రిలీజ్ కు ముందు రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో వేసిన స్పెషలు ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కేస లాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం .. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయటం శుక్రవారం బన్నీని పోలీసులు అరెస్టు చేయటం ..ఆ వెంటనే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ కు ఇవ్వటం చకచక జరిగిపోయాయి.
చివరకు హైకోర్టులో మద్యం తర బెయిలు రావడంతో బన్నీ జైలు శిక్ష తృటిలో తప్పించుకున్నట్టు అయింది. బన్నీ అరెస్టుపై శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బన్నీకి కౌంటర్ ఇచ్చినట్టుగా ఉన్నాయి. ఈ దేశంలో సల్మాన్ ఖాన్ - సంజయ్ దత్ అరెస్టు కాలేదా బెనిఫిట్ షోకు తమ పర్మిషన్ ఇచ్చామని సరైన ఏర్పాటు లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు .. కారులో నమస్కారం చేస్తూ ర్యాలీ చేశారు .. ఓ మహిళ చనిపోయింది .. ఓ బాబు చావు బతుకులో ఉన్నారు .. దీనిపై మేము కేసు పెట్టకపోతే కేసి పెట్టలేదని మమ్మల్ని ప్రశ్నించరా ? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కామెంట్లు చూస్తే బన్నీ అరెస్టు విషయంలో తప్పులేదని క్లియర్ కట్గా చెప్పినట్టు కనిపిస్తోంది. అందుకే బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా ప్రోసీజర్ లేట్ అంటూ బన్నీని రాత్రంతా జైలులోనే ఉంచారా ? అన్న సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.