ప్రస్తుతం రాజకీయాలలో, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారుతున్న వ్యవహారం రాజకీయాలు.. ముఖ్యంగా ఎవరు ఏ వైపుగా ఉన్నారో అర్థం కాలేని పరిస్థితులలో అభిమానులు ఉన్నారు.. ఒకే కుటుంబంలో ఒకవైపు ఉంటే మరొకరు ఇంకొక వైపు ఉండడంతో ఈ విషయం అభిమానులకు జీర్ణించుకోలేకపోతోంది.. ముఖ్యంగా మెగా కుటుంబ సభ్యులు కొంతమంది జనసేన వైపు ఉండగా మరికొంతమంది వైసీపీ అని మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు మరొకసారి చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారనే విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారు. మరొకసారి చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందట. ఈ విషయంపై ఏకంగా సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది.. పుష్ప సినిమాకు సంబంధించి ఏదైతే మొదటిరోజు అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళినప్పుడు సంధ్య థియేటర్లో తొక్కేసలాట జరిగిందో ఈ వ్యవహారం పైన అల్లు అర్జున్ ని అరెస్టు చేసినటువంటి వ్యవహారం మీద ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.


చిరంజీవి కూడా మా కాంగ్రెస్ నాయకుడే.. ఆయన మేనమామ , అలాగే వాళ్ళ మామగారు కూడా మా కాంగ్రెస్ పార్టీని.. ఆయన భార్య కూడా మా కాంగ్రెస్ పార్టీనే వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ నే కానీ చట్టం తన పని తాను చేసుకోబోతుందంటూ తెలియజేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మొత్తానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా లేదా అనే విషయంపై చిరంజీవి స్పందించాల్సి ఉంటుంది.. కానీ గదిచిన కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో భాగంగా కూటమిలో జనసేన పార్టీ కలవడంతో చిరంజీవి కూడా అక్కడికి రావడంతో బిజెపి పార్టీలో కీలకంగా మారబోతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. పదవులు కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు అయితే వినిపించాయి.. మరి ఏది నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: