అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.   ఇక ఇప్పుడు పుష్ప 2 భారీ కలెక్షన్లను సాధిస్తున్న వేళ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం అనేది అతని కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ ను కూడా విపరీతమైన ఆందోళనకు గురిచేసింది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన క్షేమంగా ఇంటికి రావడం అలాగే అతనికి మధ్యంతర బేయిల్ ని హైకోర్టు జారీ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తుంది. మరి ఈ కేసు ఎక్కడ దాకా వెళుతుందనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. కానీ మొత్తానికైతే ఈ కేసు తొందర్లోనే ముగియబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక లాయర్ నిరంజన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి బెయిల్ తెప్పించడంలో చాలా వరకు కృషి చేశాడు. ఆయన కష్టం వల్లే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చింది. లేకపోతే ఇప్పటికి అల్లు అర్జున్ 14 రోజుల పాటు రిమాండ్ లో ఉండేవాడు అంటూ అతని అభిమానులు కూడా నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.ఇక ఇది ఏమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా అల్లు అర్జున్ అరెస్ట్ ని సమర్థించినటువంటి వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.కాని వ్యతిరేకించినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఒక గుణపాఠం ‌.మొన్న సమంత గురించి చేసిన కామెంట్లు. సినిమా రంగం అంటే అంత చులకనగా అయిపోయిందా.ఆ భాష ఆరోజున నాగార్జున విషయంలో కూల్చి పడేయటం. సమంతా విషయంలో దారుణమైనటువంటి కామెంట్లు. అట్లాగే కేటీఆర్ ని టార్గెట్ చేస్తా వచ్చింది. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ అరెస్టు. టోటల్గా సినీ ఇండస్ట్రీ అంటే తమ కాళ్ళ కింద పడి ఉండాలి మా చెప్పు చేతలో పడి ఉండాలి. ఏ టికెట్టు గురించోనో చర్యలు తీసుకుంటే సమర్ధించవచ్చు. కానీ టికెట్ల రేట్ల పెంపు కేమో పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఎంత పడితే అంతకిచ్చేస్తున్నారు. వాళ్లు అడిగినట్లు. సరిగ్గా కంట్రోల్ చేయాలనుకుంటే టికెట్ల రేట్లపై కంట్రోల్ చేసుకోవాలి. అది చట్టబద్ధమైన కంట్రోల్. అప్పుడు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కానీ అక్కడేమో ప్రజలను దోచుకోవడానికి పరిమిషన్ ఇస్తున్నారు అదే సందర్భంలో ఇక్కడేమో వ్యక్తులగా టార్గెట్ చేస్తున్నారు.

అప్పుడేమో నాగర్జున పై.ఇప్పుడేమో ఇక్కడ అల్లు అర్జున్ పై. సరే నాగార్జునది అక్రమ కట్టడం అనుకుంటే నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వ ఉన్నప్పుడే కట్టుకున్నారు దానిపై నోటీసులు జారీ చేయకుండానే  చెప్పకుండా కూల్చి వేసేశారు. అదే సందర్భంలో కేస్ వేసామా, అరెస్ట్ చేసామా అది కూడా లేదు. అప్పుడు ప్రభుత్వం మరీ నెక్స్ట్ స్టెప్ ఎందుకు వేయలేదు. ఎందుకంటే ఆ విషయంలో ఆర్థికంగా నాగర్జున గారిని కృంగదీశారు. అలాగే సమంత విషయంలో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు మామూలు విషయం కాదు. మానసికంగా సంఘర్షణకు లోను చేశారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ నీ ఏకంగా అరెస్టు చేశారు. మొత్తం మీద చెప్పాలంటే సినిమా వాళ్ళ కంటే ప్రభుత్వమే గొప్పది. అలాగే సినిమా వాళ్ళ కంటే వ్యవస్థ గొప్పది. ఈ క్రమంలో అల్లు అర్జున్ విషయంలో వందకి 90 మంది అల్లు అర్జున్ ని సమర్థిస్తున్నారు. 10 శాతం మంది మాత్రమే అల్లు అర్జున్ కువ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాగే మనం చేసే పనులన్నీ కరెక్టే అనుకుంటే కనుక అది తప్పే అవుతుంది. ఈ పరంగా సామాన్యులు చాలా రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు.ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకొని పని చేయవలసిందిగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: