ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమ పథకాలను భారీ ఎత్తున అమలు చేయడం ప్రారంభించింది. అభివృద్ధిలోనూ దూసుకెళ్లింది. పరిపాలన విధంగానూ చాలామంది ప్రజలకు సంతృప్తిని కలిగించింది. అందుకే ప్రజల్లో చంద్రబాబు, టీడీపీ పార్టీపై ఎనలేని అభిమానం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మాటకు టీడీపీ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్స్‌ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 26 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించగా భారీ ఎత్తున ప్రజలు మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య ఏకంగా 73 లక్షలకు చేరుకుంది. ఈ రేంజ్ లో మెంబర్షిప్స్‌ నమోదు కావడం మామూలు విషయం కాదు. ఇది ఒక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు చాలా సంతోషిస్తున్నారు. వారిలో ఉత్సాహం రెట్టింపు అయింది.

రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి ఎక్కువమంది మెంబర్షిప్స్ తీసుకోవడం జరిగింది. 73 లక్షల మంది టీడీపీ మెంబర్స్ లో 85 వేల మంది తెలంగాణ ప్రజలే ఉండటం విశేషం. ఇదిలా ఉండగా చంద్రబాబు శనివారం టీడీపీ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌ను రివ్యూ చేశారు. ఎక్కువమంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనంతటికీ కారణమైన హార్డ్ వర్కింగ్ లీడర్స్‌ని అభినందించారు. కేడర్ చాలా చక్కటి పర్ఫామెన్స్ కనబరిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

 ఈ రికార్డు సాధించడం సంతోషంగానే ఉందని చెబుతూ, ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం తీసుకునేలాగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెంబర్షిప్ రిజిస్ట్రేషన్లతో టీడీపీ ఆర్మీ ని సృష్టిస్తామని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కచ్చితంగా అందిస్తామని, వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే ఏళ్ల తరబడి పార్టీలో ఉండి కూడా ఏమి చేయకపోతే వారికి ఎలాంటి ప్రతిఫలం అందించలేనని స్పష్టం చేశారు.

 మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఏ పదవిలో ఉన్న వారైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు. పదవుల్లో ఉన్న వారంతా అది పార్టీ కారణంగానే వచ్చిందని గుర్తు పెట్టుకుని పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: