గుంటూరు జిల్లాలో ఇస్కాన్ సభ్యులు రోడ్డుమీద భగవద్గీత పుస్తకాలను సైతం అమ్ముతున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి వారిని అడ్డుకున్నారట.. రోడ్డుపైన పుస్తకాలు అమ్మేయడం అభ్యంతరకాన్ని తెలియజేస్తోంది.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యే చేసిన పనిని తప్పుపడుతూ ఒక ట్విట్ చేశారు. పుస్తకాల విషయంపై నిలదీయడం ఏంటి..? గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అంటూ ఒక ట్విట్ చేశారు మీరు తెలిసి చేశారా లేకపోతే తెలియక చేశారో ఈ సమాజానికి తెలియదు? కానీ తక్షణమే మీరు ఈ తప్పును సరిదిద్దుకోవాలి అంటూ తెలిపారు. ఇటివలె జరిగిన విజయవాడ వరదల సమయంలో చాలామంది ఇస్కాన్ సంస్థ నుంచి ఆహారము, వస్త్రాలు పంపించి చాలా గొప్ప సేవ చేశారని తెలిపారు. ఈ విషయంపై చంద్రబాబు అభినందించారని కూడా తెలియజేశారు.
వాళ్లు దేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల ఉన్నత విద్యను సైతం అభ్యసించారని.. అలాగే ఎన్నో సౌకర్యాలను ఉద్యోగాలను హోదాలను కూడా త్యాగాలు చేసి మరి ఇలా సన్యాసిగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారంటూ తెలియజేశారు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి.. ఇలా భగవద్గీత ప్రచారాన్ని చేయడం కోసమే పుస్తకాల ద్వారా వారు సమాజానికి పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక ధార్మిక సంస్థ అంటూ తెలిపారు. వారికి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకమని వివరించారు.